SWARDHAM

By Mantri Pragada Markandeyulu (Author)

Language : Telugu
Pages : 315
Paperback ISBN : 9789356753532
Currency Paperback
Rupees ₹ 2499.00

Description

స్వార్ధం (డబ్బు మనుషులు) Introduction: సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకుని, మంచిగా సంసారం చేయండి మొగుడా అని అందరూ దీవిస్తే, కొంతమంది మహానుభావులు, అడ్డదారులు తొక్కి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెళ్ళైన మొదటి రెండు సంవత్సరాలు బాగానే ఉంటారు. ఆ తరువాత్త తోకజాడిస్తారు. అదంటారు, ఇదంటారు, ఏవేవో అంటారు, అర్ధంలేని మాటలు అంటారు, భార్యని ఇబ్బందిపెడతారు, సతాయిస్తారు, కొడతారు, ఇంకా అనరాని మాటలు అంటారు. శాడిస్టిక్ బ్రెయిన్ గా ఉంటారు. ఎందుకోమరి. మొగుడి చేష్టలకి అర్ధం పర్ధం ఉండదు. భార్య ఏమీ అనలేక, ఏమీ చెప్పలేక, తమవారికి కూడా ఏమీ సంగతులన్నీ తెలియనీయక పడిఉంటుంది. ఎందుకంటె, అప్పటికే ఇద్దరి పిల్లలు ఉంటారు. ఇటు పిల్లల్ని చూసుకుంటుందా లేదా మొగుడి బాధలను తట్టుకుంటుందా, లేదా బుర్ర పాడై ఏడ్చుకుంటూ ఉంటుందా అనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఇలాంటి గాడి తప్పిన జీవిత గాధలు ఈ ప్రపంచంలో అనేకం, కోకొల్లలు. ఇలాంటి కధలు, గాధలు, కొన్ని మచ్చుతునకకి మీముందు ఉంచుతున్నాను. ఈ కథలు చదివి, జీవితం ఏమిటో తెలుసుకొని, జీవితం జీవితం కొనసాగించాలని, భార్య భర్తలు కలిసి జీవితాన్ని సర్కార్ ఎక్ష్ప్రెస్స్ లా ముందుకి సాగుతూ, తమ ఆశలు, ఆశయాలను సాధించుకోవాలని, పిల్లలని అభివృద్ధిలోకి తేవాలని, అడ్డదారులు తొక్కకుండా ఉండాలని, చెడుమార్గాలకు దూరంగా ఉండాలని, తమ సంసారం, తమ ధ్యేయం లక్ష్యంగా ఉండాలని, ఇతరుల సంసారాలని పట్టించుకోకుండా, తమ సంసారాలని సాగించాలని, పక్కింటి పోకడల్ని, ఇతరుల దర్జాలాని పట్టించుకోకుండా ఉండాలని, ఇతరులు పనికిమాలిన మాటలు ఎక్కించినా పట్టించుకోకుండా ఉండాలని, జీవితం అంటే నూరేళ్ళ సంసారం అని, తమ ఇంటిపేరును నిలబెట్టాలని కోరుతున్నాము. ఈ ప్రపంచమంతా, డబ్బు, డబ్బు, డబ్బు, ఖూనీలు, దోచుకోవడాలు, దొంగతనాలు, ఈర్య, ద్వేషం, పగ, కబ్జాలు, ఒకరిని మోసం చేసి వేరొకరు ఎలా డబ్బు సంపాదించాలా అనే వారు చాలామందే ఉన్నారు. కానీ అందరూ ఈ విషయంలో బయటపడ్డారు. కొద్దీ మండే వారి ఖర్మ కాలి బయటపడతారు. అంతా స్వార్ధం. చాలామంది ప్రజలు స్వార్ధపరులు. కానీ వేరేవారికి అపకారం చేయరు చాలామంది. కొద్దిమంది మాత్రమే స్వార్ధం తోనే పనులుచేస్తుంటారు, అది కూడా డబ్బుకోసం. స్వార్ధం లేనివారు కూడా వున్నారు చాలామంది ఈ భూ ప్రపంచంలో. కానీ అతి అరుదుగా బయటకు కనబడతారు వారు. ఏది ఏమైనా, ఈ స్వార్ధ లోకంలో అనేకరకాలైన మనుసుహులుంటారు. ఒకరిని మించిన వారొకరుంటారు. అలాంటి వారికి సంబందించిన కొన్ని కథలు, మీముందు ఉంచుతున్నాము. మంచి మనసు కలవారి కథలు కూడా కొన్ని ప్రేక్షకులకొరకు ఇక్కడ ప్రచురిస్తున్నాము. చాలామటుకు, ఈ కథలు, నిజంగా జరిగినవే. ఈ కాలంలో జరుగుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పుస్తకంలో కొన్ని యదార్ధ గాథలు మీ ముందు ఉంచుతున్నాము. చాలామటుకు అనేక సంసారాలు రోడ్డున పడ్డాయి. చాలామటుకు ఆడపడుచుల జీవితాలు చితికిపోయాయి. వీటన్నిటికీ కారణం భర్త యొక్క దురలవాట్లు, చెడు సావాసాలు, త్రాగుడు, జూదము, రేసులు, పేకాటలు, గ్యాంబ్లింగ్ చేయుట, తనసొంత భార్యకు తెలియకుండా ఇతర ఆడవారితో సహజీవనం చేయడం వంటి అవలక్షణాలు ఉండుట. భర్త సరిగా ఉంటె అనేక జీవితాలు, సంసారాలు బాగుపడుతాయని, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆశిస్తున్నాము. ఈ కథలను చదివి, మీ గమ్యాలను అడ్డదారులనుంచి కాపాడుకోవాలని, మంచి జీవితాలను గడపాలని, సహృదయంతో భార్య భర్తలు జీవితాలు గడుపుతూ, సంఘసేవలు కూడా వీలయితే చేయాలని ఆసిస్తూ, ప్రేక్షలకు, ఈ కథలు చదివే వారికి ధన్యవాదాలు, వందనములు, బహువందనములు.


About Contributor

Mantri Pragada Markandeyulu

Novelist, Story and Songwriter, Poet. He is a trainer in management programs and personality development programs. He is a retired Public Sector Enterprise Officer (Opted for VRS during 1993 March)


Genre

Art : Asian

Comics & Graphic Novels : Crime & Mystery

Drama : Medieval